
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ సంకీర్తన విపిన్. ఇటీవలే జనక అయితే గనక సినిమాతో టాలీవుడ్ అడియన్స్ ను అలరించింది ఈ అమ్మడు. అయితే తెలుగులో ఇదివరకు పలు చిత్రాల్లో నటించిన ఈ సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకుంది.

సంకీర్తనా విపిన్.. సొంతూరు కేరళలోని నీలేశ్వర్ పట్టణం. తల్లిదండ్రులు సీమ, విపిన్. ఈ బ్యూటీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. గతేడాది నరకాసుర సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయిన ఆమె నటనకు మాత్రం ప్రశంసలు అందాయి. ఆ తర్వాత ఈ వయ్యారికి ఆపరేషన్ రావణ్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే సుహాస్ సరసన జనక అయితే గనక సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. మంచి సినిమా అంటూ టాక్ సంపాదించుకుంది.

సినిమా ప్లాప్ అయిన ప్రతిసారి ఇది నీకు సెట్ కాదు.. వేరే ప్రొఫెషన్ చూసుకో అంటూ వచ్చే నెగిటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోను అని.. అలాంటి మాటలతో వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటారని చెప్పుకొచ్చింది.