
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకడు. ఇక సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోకి అడుగు పెట్టిన అతను ఇప్పుడు టాప్ కమెడియన్ గా ఎదిగాడు

ఇక కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమాతో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు జబర్దస్త్ రాకింగ్ రాకేష్. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా రాకింగ్ రాకేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

కాగా రాకింగ్ రాకేష్ తనతో పాటు జబర్దస్త్ లో కలిసి నటించిన జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ దంపతులకు ఖ్యాతిక అనే ఒక ముద్దుల కూతురు జన్మించింది.

ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలతో బిజీగా ఉంటోన్న రాకింగ్ రాకేష్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడికి మొక్కులు సమర్పించాడు.

అనంతరం అక్కడే ఉన్న గోశాలకు వెళ్లి అక్కడ గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తన ఫొటోలకు 'గోపూజ సకల శుభదాయకం.. భారత్ మాతాకీ జై' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు రాకేష్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.