
తెలంగాణ కుంభమేళగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న ఈ మహా ఉత్సవానికి సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్, టాలీవుడ్ నటుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సందడి చేశాడు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నాడు

బుధవారం (జనవరి 28) తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారంకు వచ్చిన రచ్చ రవి మొదట సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు సమర్పించాడు

తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్న రచ్చ రవి అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రచ్చ రవి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న కమెడియన్లలో ఒకరు.