Basha Shek |
Dec 14, 2024 | 3:24 PM
జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై బాగా సక్సెస్ అయిన వారిలో ఆమె కూడా ఒకరు. ఫైమా కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీషోలతో బిజీ బిజీగా ఉంటోంది ఫైమా. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే
కాగా ఫైమా తన తోటి కమెడియన్ పటాస్ ప్రవీణ్‌తో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని నెలల క్రితం తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చిందీ లేడీ కమెడియన్.
ప్రవీణ్ (పటాస్ ప్రవీణ్ కాదు) అనే అబ్బాయితో తాను చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫైమా.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ అందమైన ఫొటోషూట్ లో పాల్గొన్నారు. దీనికి 'ఆరేళ్లు పూర్తయ్యింది. మా ప్రేమతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను' అంటూ తమ ఫొటోలను షేర్ చేశారీ లవ్ బర్డ్స్.