
అనగనగా ఓ హీరో.. ఆ హీరో మైండ్‌లో ఓ చిప్.. ఆ చిప్‌తో మనిషిని కంట్రోల్ చేయడం.. ఇదంతా చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా గుర్తుకొస్తుంది కదా..! అవును మన పూరీ జగన్నాథ్ ఐదేళ్ల కింద చేసిందే ఇప్పుడు ఎలన్ మస్క్ నిజంగా చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీని మిళితం చేసి పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర రప్ఫాడించింది. ఇప్పుడు సీక్వెల్ కూడా చేస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ మెదడులో బ్రెయిన్ చిప్ పెడతారు. ఇప్పుడిదే పని ఎలన్ మస్క్ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరోలింక్ కంపెనీ చేసింది. ఓ మనిషి మెదడులో వైర్ లెస్ చిప్ అమర్చింది.

అనంతరం ఆ మనిషి మెదడు కార్యకలాపాలు గుర్తించామని.. పేషెంట్ కోలుకున్నారని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇదే పని ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పూరీ జగన్నాథ్ కూడా చేసి చూపించారు.

ఇస్మార్ట్ శంకర్‌లో రామ్, పూరి నమ్మిన కథను ఎలన్ మస్క్ నిజం చేయడం.. నిజ జీవితంలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా ఉంది కదా..! మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఊహించడానికి కష్టం.

కానీ దాన్ని నిజం చేసారు మస్క్. ఇప్పుడేకంగా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు పూరీ. ఇది కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీపైనే నడుస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఇదెలా ఉండబోతుందో..?