
గత రెండేళ్లుగా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు కావ్య థపర్. కానీ ఈమె కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. రామ్‌తో డబుల్ ఇస్మార్ట్.. రవితేజతో ఈగల్.. గోపీచంద్‌తో విశ్వం ఇలా ఎన్ని చేసినా ఫలితం మాత్రం శూన్యమే. ఈమె కెరీర్‌కు ఏ సినిమా హెల్ప్ అవ్వలేదు.

సాయి మంజ్రేకర్ పరిస్థితీ అంతే.మేజర్‌తో మంచి హిట్ కొట్టిన సాయి మంజ్రేకర్‌కు ఆ తర్వాత మళ్లీ హిట్ లేదు. వరుణ్ తేజ్ గని, రామ్ పోతినేని స్కంద దారుణంగా బోల్తా కొట్టాయి.

ఈ మధ్యే విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. గ్లామర్ షో చేస్తున్నా సాయి మంజ్రేకర్‌కు ఒరిగిందేమీ లేదు. ఇస్మార్ట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, నభా నటేష్ సిచ్యువేషన్ కూడా ఇంచుమించు ఇంతే.

ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్న నిధి అగర్వాల్, నభా నటేష్.. ఆ తర్వాత మాత్రం ఖాళీ అయిపోయారు. నిధికి చేతిలో ప్రభాస్ రాజా సాబ్, పవన్ హరిహర వీరమల్లు ఉన్నా అవెప్పుడు వస్తాయో తెలియదు.

మరోవైపు నభా నటేష్ స్వయంభులో నటిస్తున్నారు. మొత్తానికి గ్లామర్ షోతో మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వరు అనడానికి ఈ హీరోయిన్లే నిదర్శనం.