
డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు.

2022లో విడుదలైన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది.

ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో వీరికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

అయితే గతంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని డైరెక్టర్ హను రాఘవపూడి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఇక సీతారామం పార్ట్ 2 కూడా ఉంటే ఆ సినిమాకు ఇష్టపడే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.