
ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ప్రతీ హీరో పాన్ ఇండియా టార్గెట్‌గా సినిమాలు సిద్ధం చేస్తున్నారు. అయితే రీజినల్ హీరోకి నేషనల్ మార్కెట్‌లో గేట్స్ ఓపెన్ కావటం అంటే మామూలు విషయం కాదు. అందుకే పాన్ ఇండియా ఎంట్రీ కోసం కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారు మేకర్స్,

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌కు గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాతో నేషనల్ సూపర్ స్టార్‌గా అవతరించారు డార్లింగ్ ప్రభాస్. ఆ ఇన్‌స్పిరేషన్‌తో మరికొంత మంది స్టార్స్ పాన్ ఇండియా అటెంప్ట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు డైరెక్టర్‌గా నేషనల్ అప్పీల్ ఉన్న సినిమాలతో బరిలో దిగుతుంటే. మిగతా భాషల హీరోలు మాత్రం ముందు సపోర్టింగ్ రోల్స్‌తో ఎంట్రీ ఇచ్చి తరువాత సోలోగా మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు.

జైలర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేసిన రోల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెర మీద కనిపించింది కొద్ది క్షణాల పాటే అయినా... తన మార్క్ చూపించి నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ చేశారు శివన్న. అదే జోరులో ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

శివరాజ్ కుమార్ హీరోగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన మూవీ ఘోస్ట్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఆడియన్స్ జైలర్‌ను మర్చిపోకముందే అక్టోబర్‌లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.నేషనల్ సినిమాల్లో గెస్ట్, విలన్ రోల్స్‌తో పరిచయం అయి, ఆ తరువాత హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నారు మాలీవుడ్ స్టార్స్.

మాలీవుడ్ హీరోలైతే ఈ ఫార్ములాను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ముందు అదర్ లాంగ్వేజెస్‌లో ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆ తరువాత పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో అందరి కంటే ముందున్నారు వర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్. ఓటీటీ టైమ్‌లో డబ్బింగ్ సినిమాలతో అన్ని భాషల ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ఫాఫా, పుష్ప సినిమాతో ఆల్రెడీ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేశారు.

పుష్ప ఫస్ట్ పార్ట్‌లో కొద్ది సేపే తెర మీద కనిపించినా... భన్వర్‌సింగ్ షెకావత్‌గా తన మార్క్ చూపించారు.పుష్ప 2లో మెయిన్ విలన్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు ఫాహద్. ఆల్రెడీ నేషనల్ వైడ్‌గా ఓటీటీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఫాఫా, పుష్ప 2 తరువాత థియేట్రికల్‌గానూ సూపర్ పాపులర్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా అటెంప్ట్స్ ప్రారంభించిన ఈ విలక్షణ నటుడు, ఫ్యూచర్‌లో మరిన్ని ప్రాజెక్ట్స్ నేషనల్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

మరో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నేషనల్ మార్కెట్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం అయిన పృథ్వీరాజ్.. ఇప్పుడు మిషన్ పాన్ ఇండియా అంటూ వర్క్ చేస్తున్నారు.

ప్రజెంట్ ప్రభాస్ సలార్‌లో నెగెటివ్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్, ఆల్రెడీ పాన్ ఇండియా మూవీస్‌కు రెడీ అయిపోయారు. హీరోగా పరిచయం అవ్వటం కన్నా ముందు దర్శకుడిగా నేషనల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మోహన్‌లాల్ హీరోగా రూపొందుతున్న లూసీఫర్ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు.