- Telugu News Photo Gallery Cinema photos Huge Views for Nani saripodhaa sanivaaram movie glimpse in social media Telugu Heroes Photos
Nani – Saripodhaa Sanivaaram: నానికి కోపం.! వారం రోజుల కోపాన్ని ఒకేరోజే చూయిస్తున్నాడు.
మీకు కోపం వస్తే ఏం చేస్తారు..? వెంటనే రియాక్ట్ అవుతారు కదా.. ఒకవేళ కాకపోయినా కాసేపయ్యాక అయినా ఆ రియాక్షన్ ఉంటుంది కదా..? కానీ నాని మాత్రం అలా కాదు.. వారం రోజుల కోపం అంతా ఒకరోజు కోసం స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. అదేంటి వింతగా అనుకుంటున్నారు కదా..? వింతగా ఉంది కాబట్టే అదే కథతో వస్తున్నారు. చూస్తున్నారుగా.. నాని కోపాన్ని..! వారం రోజుల కోపాన్ని ఒకేరోజు చూపిస్తున్నారు నాని.
Updated on: Feb 25, 2024 | 9:18 PM

మీకు కోపం వస్తే ఏం చేస్తారు..? వెంటనే రియాక్ట్ అవుతారు కదా.. ఒకవేళ కాకపోయినా కాసేపయ్యాక అయినా ఆ రియాక్షన్ ఉంటుంది కదా..? కానీ నాని మాత్రం అలా కాదు.. వారం రోజుల కోపం అంతా ఒకరోజు కోసం స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు.

అదేంటి వింతగా అనుకుంటున్నారు కదా..? వింతగా ఉంది కాబట్టే అదే కథతో వస్తున్నారు. చూస్తున్నారుగా.. నాని కోపాన్ని..! వారం రోజుల కోపాన్ని ఒకేరోజు చూపిస్తున్నారు నాని.

విచిత్రంగా ఉంది కదా.. వివేక్ ఆత్రేయ లైన్ చెప్పినపుడు నాని కూడా ఇంతే కొత్తగా ఫీలయ్యాడేమో మరి..? అందుకే ముందు ఓ ఫ్లాపిచ్చినా అదేం పట్టించుకోకుండా వెంటనే మరో ఆఫర్ ఇచ్చారు.

ఆ నమ్మకమే ఇప్పుడు సరిపోదా శనివారం టీజర్‌లోనూ కనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలా ఉండటం అంటే బోర్ కదా.. అందుకే ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉండాలి అంటున్నారు నాని.

కథల విషయంలో ఈయన తీసుకునే జాగ్రత్తలు కూడా అలాగే ఉంటాయి. గతేడాది దసరా, హాయ్ నాన్నలతో హిట్స్ కొట్టిన నాని.. ఈ ఏడాదిని సరిపోదా శనివారంతో మొదలు పెడుతున్నారు.

ఇది యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లోనే వస్తుంది. అంటే సుందరానికి ఫ్లాప్ అయినా కూడా వివేక్ టేకింగ్ నచ్చడంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. సరిపోదా శనివారం టీజర్ చూసాక నాని నమ్మకాన్ని వివేక్ నిలబెట్టేలా కనిపిస్తున్నారు.

ఆగస్ట్ 29న విడుదల కానుంది ఈ చిత్రం. సరిపోదా శనివారం థియెట్రికల్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నారు. చూడాలిక.. నాని ఈ కోపంతో బాక్సాఫీస్ దగ్గర ఏం చేయబోతున్నారో..?




