- Telugu News Photo Gallery Cinema photos How many actress in chiranjeevi's Vishwambhara movie and ashika ranganath look Telugu Heroes Photos
Vishwambhara: విశ్వంభరలో ఎంతమంది హీరోయిన్స్..? లిస్ట్ పెద్దదే బాస్..
విశ్వంభరలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు బాస్..? మామూలు మెగా అభిమానికే కాదు.. కామన్ ఆడియన్స్ మనసులోనూ ఇదే అనుమానం వస్తుందిప్పుడు. ఎందుకంటే రోజుకో హీరోయిన్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నా అంటున్నారు. తాజాగా మరో బ్యూటీ పేరు ఫైనల్ అయింది. అసలింతకీ విశ్వంభర ముచ్చట్లేంటి..? అందులో ఉన్న ముద్దుగుమ్మలెంతమంది..? చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ సూపర్ ఫాస్టుగా జరుగుతుంది.
Updated on: Jun 01, 2024 | 11:12 AM

విశ్వంభరలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు బాస్..? మామూలు మెగా అభిమానికే కాదు.. కామన్ ఆడియన్స్ మనసులోనూ ఇదే అనుమానం వస్తుందిప్పుడు. ఎందుకంటే రోజుకో హీరోయిన్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నా అంటున్నారు.

సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ విడుదల కావట్లేదు కానీ షూటింగ్స్ కళ మాత్రం బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ సెట్స్‌లోనే ఉన్నారు.. ఒకరిద్దరు మినహా. పవన్ ఇంకా కొన్నాళ్లు పాలిటిక్స్‌తోనే బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు.

ఇప్పటికే ఫస్టాఫ్ అయిపోయింది.. సెకండాఫ్ షూట్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు.

మధ్యలో ఆచార్య అనుకున్నా.. జస్ట్ మిస్ అయిపోయింది ఈ జోడీ. త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు విశ్వంభరలో నటిస్తున్నారు. అంజి తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఇది.

అందులోనూ నమ్రత శిరోద్కర్‌తో పాటు రీమా సేన్, రమ్యకృష్ణ, రాజ్యలక్ష్మి రాయ్, అల్ఫోన్సా లాంటి హీరోయిన్లు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వంభరలోనూ ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. చిరు జోడీ మాత్రమే త్రిషనే. మిగిలిన హీరోయిన్లంతా కథ ప్రకారం వస్తుంటాయని తెలుస్తుంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

200 కోట్లకు పైగా బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. 2025, జనవరి 10న సంక్రాంతి కానుకగా విశ్వంభర విడుదల కానుంది. మరి ఇంతమంది బ్యూటీస్ మధ్య చిరు పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలిక.




