Flashback 2024: ఒక్కటంటే ఒక్కటీ లేదు.. ఈ ఏడాది ఫ్యాన్స్‌‌ను నిరాశపరిచిన ఆ హీరోయిన్స్..

|

Dec 06, 2024 | 2:13 PM

ఆడియన్స్ కి అందుబాటులో ఉండటం కోసం ఏదో రకంగా స్క్రీన్‌ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు. బిగ్‌ స్క్రీన్‌ మీద హీరోయిన్‌గా మెప్పించడం వేరు.. అలా బిగ్‌ స్క్రీన్‌ మీద ఈ ఏడాది నాయికగా కనిపించని వాళ్లెవరు... మరీ ముఖ్యంగా జనాలందరూ వీరి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు.. మాట్లాడుకుందాం.. పదండి

1 / 5
గతంలో ఎప్పుడూ లేనంత అగ్రెసివ్‌గా ఉంది నయనతార. ఇద్దరు పిల్లల తల్లిగా, నార్త్ లో ఎంట్రీ మూవీతోనూ వెయ్యి కోట్లు తెచ్చుకున్న నాయికగా.. అన్ని విధాలా లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఆమె పెళ్లి వీడియో ఇటీవల నెట్‌ఫ్లిక్స్‎లోనూ రిలీజ్‌ అయింది. దీనికి సంబంధించి ధనుష్‌ కొన్ని సెకన్ల క్లిప్‌కి కూడా పర్మిషన్‌ ఇవ్వకపోవడం రచ్చ రచ్చయింది. ఇన్ని విధాలుగా లైట్‌లైట్‌లో ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది ఒక్క మూవీని కూడా థియేటర్లలో రిలీజ్‌ చేయలేదు. 

2 / 5
కాంటెంపరరీ బ్యూటీ త్రిష.. గోట్‌లో ఓ సాంగ్‌కి స్టెప్పులేసింది. అంతేగానీ, పూర్తి స్థాయి సినిమాను థియేటర్లలో విడుదల చేయలేదు త్రిష. ప్రస్తుతం తెలుగు చిరంజీవికి జోడిగా విశ్వంభర సినిమాలో నటిస్తుంది.

3 / 5
మన లేడీ లక్‌ అనుష్క కూడా ఈ ఏడాది స్క్రీన్‌ మీద మెప్పించలేదు. ఆమె నటించిన ఘాటీ, కథనార్‌ టీజర్లని బర్త్ డే సందర్భంగా రిలీజ్‌ చేశారు. 2025లో ఒకటికి రెండు సినిమాలతో మెప్పిస్తాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది స్వీటీలో.

4 / 5
సమంతకు ఈ ఏడాది డిజిటల్‌ పరంగా సిటాడెల్‌ హనీ బన్నీ రిలీజ్‌ అయింది. కానీ, సినిమాల రిలీజులు లేవు. 2025లో కూడా సినిమాలు ఉంటాయో లేవో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఆమె యాక్టివిటీకి సంబంధించి ప్రోగ్రెస్‌ రిపోర్ట్ వస్తే తప్ప ఇతమిత్థంగా ఈ టైమ్‌కి మూవీ ఎక్స్ పెక్ట్ చేయొచ్చని చెప్పలేని పొజిషన్‌ అన్నమాట.

5 / 5
పూజా హెగ్డే తెలుగుకు దూర దూరంగా జరుగుతున్నట్టే ఉన్నా... 2025లో దేవా అనే బాలీవుడ్‌ మూవీతో, తమిళ్‌లో సూర్య 44తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. 2024లో మిస్‌ అయిన ఆడియన్స్ 2025లో పండగ చేసుకుంటారన్నది పూజా వైపు నుంచి వినిపిస్తున్న మాట.