Tripti Dimri: సౌత్ లో తారక్ పై మనసు పారేసుకున్న యానిమల్ బ్యూటీ త్రిప్తి.
యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోయిన త్రిప్తి డిమ్రికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఎక్కడికెళ్లినా.. తనను అందరూ... ఓ వరుసతో పిలవడమే తనకొచ్చిన పెద్ద కష్టం అంటుంది ఈ బ్యూటీ.. రణ్బీర్ లవర్ జోయాగా... యానిమల్ సెకండ్ ఆఫ్‌లో వచ్చి... అందర్నీ మెస్మరేజ్ చేసిన త్రిప్తి డిమ్రి... ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ ఫిల్మ్ మెయిన్ హీరోయిన్ రష్మిక మందననే మరిపించేసింది. ఇక తాజాగా యానిమల్ సినిమాతో నయా నేషనల్ క్రష్గా మారిన త్రిప్తి కూడా..