
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టీ పెట్టగానే క్లిక్ అయిన వారు ఎవరా అని ఆరా తీస్తే, ఎక్కడో ఒకటీ అరా కనిపించొచ్చు. మిగిలిన 99 శాతం కష్టపడి, రోజూ రకరకాల ప్రయత్నాలు చేసి సక్సెస్‌ని చూసిన వారే.

ఆ 99 శాతంలోనే నేనూ ఉన్నానని అంటున్నారు నయా నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రి. ఈ గ్లామర్ డాల్ కెరీర్‌లో చేదు జ్ఞాపకాలున్నాయా.? మంచి చెడులు మాట్లాడేవాళ్లు విడివిడిగా ఉండరు.

ఆ సమయానికి వాళ్లకు ఏం అనిపిస్తే అదే మాట్లాడుతారంటున్నారు నటి త్రిప్తి దిమ్రి. తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన పలు విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో కెరీర్ వెతుక్కుంటానని తాను ముంబైకి వచ్చినప్పుడు, పొరుగువారు, బంధువులు తన తల్లిదండ్రులను భయపెట్టిన తీరు గురించి గుర్తుచేసుకున్నారు.

ఎవరో మన వాళ్లని భయపెట్టారని, మన ప్రయత్నాలు విరమించుకోకూడదన్నది త్రిప్తి ఇస్తున్న సలహా. మంచి సక్సెస్ పలకరించిన రోజు, దూరమైనవారందరూ దగ్గరవుతారని,

ఎలాగైనా గెలవాలన్న ధ్యేయంతోనే అడుగు ముందుకేయాలని సజెస్ట్ చేస్తున్నారు నయా నేషనల్ క్రష్. యానిమల్ బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత జనాలు తనను చూసే తీరే మారిపోయిందంటున్నారు ఈ బ్యూటీ.

అంతే కాదు, ఫ్యాన్స్ నయా నేషనల్ క్రష్ అని ట్యాగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందని, రెట్టింపు కష్టపడాలనిపిస్తోందని చెబుతున్నారు. యానిమల్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ తో పాటు తాను కూడా వెయిటింగ్ అంటున్నారు ఈ లేడీ.