- Telugu News Photo Gallery Cinema photos Jr.NTR Devara Movie success celebrations and Devara part 2 shooting update here Telugu Heroes Photos
NTR-Devara: దేవర పార్ట్ 2 షూటింగ్ అప్పుడే మొదలు.. రివీల్ చేసిన తారక్ రాయుడు.!
కలెక్షన్ల దుమ్మురేపుతోంది దేవర మూవీ. లేటెస్ట్ గా దావూదీ సాంగ్ థియేటర్లలో కలర్ యాడ్ చేసింది. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్‌కి హిట్ వస్తుందా? లేదా? అనే టెన్షన్ లేదిప్పుడు.. జస్ట్ సెకండ్ పార్టు ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మీరు చూపిస్తున్న అభిమానానికి ఈ జన్మలో నేనిస్తున్నది జస్ట్ వడ్డీ మాత్రమే.. అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పారు తారక్.
Updated on: Oct 07, 2024 | 2:42 PM

లేటెస్ట్ ఇంటర్వ్యూలో సీక్వెల్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు కెప్టెన్ కొరటాల. రెండో భాగంలో కీలకమైన గెస్ట్ రోల్స్ ఉన్నాయని, ఆ పాత్రల్లో టాప్ స్టార్స్ నటిస్తే బాగుంటుందన్నారు.

ఈ వరల్డ్‌లోకి మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ వచ్చే ఛాన్స్ ఉందన్న హింట్ ఇస్తున్నారు. ఎవరా స్టార్స్ అనుకుంటున్నారా.? దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు కొరటాల శివ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. తారక్, కొరటాల ఇద్దరి కెరీర్‌లకు కీలకమైన సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్‌ను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ, పార్ట్ విషయంలో మరింత ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అసలు కథ అంతా సీక్వెల్‌లోనే ఉందని చెప్పిన దర్శకుడు,

దేవర సక్సెస్ తరువాత వరుసగా మీడియాతో మాట్లాడుతున్న కొరటాల శివ, పార్ట్ 2 మీద అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు కథ అంత సీక్వెల్‌లోనే ఉంటుందని, తొలి భాగంలో చూసింది 10 శాతమే అంటూ హైప్ పెంచేశారు.

కొరటాలకు కెరీర్‌కి బూస్ట్ ఇచ్చింది దేవర. ఇప్పడు థియేటర్లలో యాడ్ చేసిన దావూదీ సాంగ్ అభిమానుల్లో డబుల్ జోష్ నింపేసింది. ఇదే ఆనందంలో సెకండ్ పార్టు ఎప్పటి నుంచి మొదలుపెట్టేస్తారో చెప్పండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

ఇప్పుడు వార్2 పనుల్లో బిజీగా ఉన్నారు తారక్. ఆ వెంటనే నీల్ సినిమా సెట్స్ లోకి వెళ్తారు. మరోవైపు నెల్సన్‌తో సినిమా ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఆ తర్వాతగానీ దేవర2 షూటింగ్ సంగతులను తలచుకోరా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్.




