
అప్పుడెప్పుడో సమంత చెప్పిన మాటల మీద సీరియస్‌గానే వర్కవుట్ చేస్తున్నారు నటి శ్రీలీల. ఇంతకీ సమంత ఏం చెప్పారా అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి పని చేసిన టీమ్‌తో మళ్లీ మళ్లీ చేయాలని..

కాంబినేషన్లను రిపీట్ అవుతున్న కొద్దీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని.. సామ్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ని సిన్సియర్‌గా ఫాలో అవుతున్నట్టున్నారు శ్రీలీల.

గుంటూరు కారం సినిమాలో శ్రీలీల వేసి స్టెప్పులకి, స్టేజ్ మీద ఈ బ్యూటీ గురించి మహేష్ చెప్పిన మాటలకీ... ఇక ఒక్క రోజు కూడా శ్రీలీల ఖాళీగా ఉండరు అని అనుకున్నారంతా. కానీ, అనుకున్నదొకటి అయింది ఇంకొకటి.

కెరీర్ ఊపు మీదున్నప్పుడే బ్రేక్ తీసుకున్నారు మిస్ లీల. కెరీర్ అన్నాక సక్సెస్, ఫెయిల్యూర్స్ కామనే అనుకుని వరుసగా సినిమాలకు సైన్ చేయాల్సిందేమో.. అలా కాకుండా నిలిచి నిదానంగా డెసిషన్స్ తీసుకుందామనుకున్నారు ఈ బ్యూటీ.

అమాంతంగా వచ్చిన ఫేమ్‌ని సస్టెయిన్ చేయడంలో కాస్త తడబడ్డారని అనిపించుకున్నారు శ్రీలీల. ఇప్పుడు మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అందులో భాగంగానే తన ధమాకా హీరో రవితేజతో జోడీ కట్టబోతున్నారా? మాస్ మహరాజ్‌తో ఈ బ్యూటీ నటిస్తారనే మాట ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో ఇదే వైరల్ టాపిక్.

కోలీవుడ్ నుంచి వచ్చిన విజయ్ గోట్ మూవీ ఆఫర్‌నీ వద్దనుకున్నారు శ్రీలీల. ఇప్పుడు తెలుగులో ఆమెకుసెట్స్ మీద పవర్‌స్టార్ సినిమా ఉంది. రవితేజ 75 కూడా యాడ్ అయితే.. మళ్లీ ఈ లేడీ ఒకరకంగా ఫామ్‌లోకి వచ్చినట్టే అనుకోవాలి.