- Telugu News Photo Gallery Cinema photos Heroine Sai Dhanshika mesmerizing photos goes viral in social media
Sai Dhanshika: నదిలో ఒంపు సొంపులు.. చందమామలో అందం ఈ కోమలి సొంతం..
సాయి ధన్షిక ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళ సినిమాలలో కనిపిస్తుంది మరియు కొన్ని తెలుగు చిత్రాలకు ఫోన్ చేసింది. ఆమె కెరీర్‌లో సౌత్‌లో రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇవి కాస్త వైరల్ గా మారాయి.
Updated on: Jun 25, 2024 | 3:27 PM

సాయి ధన్షిక ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళ సినిమాలలో కనిపిస్తుంది మరియు కొన్ని తెలుగు చిత్రాలకు ఫోన్ చేసింది. ఆమె కెరీర్‌లో సౌత్‌లో రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇవి కాస్త వైరల్ గా మారాయి.

20 నవంబర్ 1989న తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన తంజావూరులో జన్మించింది వయ్యారి భామ సాయి ధన్షిక. ఎక్కువగా తమిళంలో నటిస్తుంది ఈ వయ్యారి భామ. 2006లో తమిళ చిత్రం మనతోడు మజాయికాలంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది.

అదే ఏడాది మరంతన్ మీమరంతన్, తిరుడి చిత్రాల్లో కనిపించింది. ఈ మూడు చిత్రాల్లో మరీనా అనే పేరుతో గుర్తింపు పొందింది. 2009లో కెంపా అనే కన్నడా యాక్షన్ డ్రామా సినిమాతో శాండల్ వుడ్ ప్రేక్షకులను పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

తమిళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురు పాత్రతో తెలుగులో కూడా పేరు తెచ్చుకుంది. 2017లో ప్రయోగాత్మక సంకలన చిత్రం సోలో సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయకిగా తొలిసారి మలయాళీ సినిమాలో కనిపించింది.

2019లో ఉద్ఘర్ష అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కథానాయకిగా రెండోసరి కన్నడ చిత్రం చేసింది. తర్వాత కన్నడలో కనిపించలేదు. 2022లో కామెడీ ఎంటర్టైనర్ చిత్రం షికారులో ముఖ్య పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఇది ఈమెకు తొలి తెలుగు సినిమా.