
యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక మందన్న, ఆ సినిమా సూపర్ హిట్ అయినా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మాత్రం కనిపించలేదు. దీంతో యూనిట్ రష్మికను నెగ్లెట్ చేసిందని, రష్మికే యూనిట్‌కు దూరంగా ఉంటుందని రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.

ఇంతకీ అసలేం జరిగింది...? ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు నేషనల్ క్రష్. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ పెర్ఫామెన్స్‌కు ఎంత పేరొచ్చిందో, రష్మికకు కూడా అదే రేంజ్‌లో అప్లాజ్ వచ్చింది. అయినా ఆఫ్టర్ రిలీజ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో రష్మిక ప్రజెన్సే కనిపించలేదు.

దీంతో ఈ బ్యూటీకి యూనిట్‌తో గొడవలయ్యాయా? అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు నేషనల్ క్రష్. యానిమల్ సినిమా రిలీజ్ అయిన వెంటనే తాను మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి రావటం వల్లే సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గోనలేకపోయా అన్నారు.

అంతేకాదు ఇప్పటికీ ఆ సక్సెస్‌ను ఆస్వాదించలేకపోయానన్న గిల్ట్ ఉందన్నారు నేషనల్ క్రష్. ప్రజెంట్ తెలుగులో పుష్ప 2, గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ.

ఈ మూవీస్‌తో పాటు బాలీవుడ్‌లో చావ అనే మూవీకి కూడా ఓకే చెప్పారు. ఇన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి కాబట్టే యానిమల్ ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ మూవీ యానిమల్.

రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. త్వరలో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్‌ను కూడా ప్లాన్ చేస్తోంది యూనిట్. పార్ట్ 2లో హీరోయిన్‌గా కనిపించబోతున్నారు రష్మిక మందన్న.