
పూజా హెగ్డే.. టాలీవుడ్ బుట్ట బొమ్మ.. ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం అవకాశం మిస్ అయ్యింది.

తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా..? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు.. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు..

ఈ భామ గోల్డెన్ టైమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా..? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి.?

పూజా కూడా రియాలిటీ అర్థం చేసుకుని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారా..? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో..?

జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్యే నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో పూజాను హీరోయిన్‌గా ఎంచుకున్నారు.

విరూపాక్ష డైరక్టర్ కార్తిక్ దండుతో చేయబోయే సినిమా మాత్రం పూజకి మోస్ట్ ఇంపార్టెంట్. కమ్‌బ్యాక్‌లో ఆమె కెరీర్‌ని డిసైడ్ చేసే మూవీ అవుతుంది కాబట్టి.. ఇప్పుడు పూజా ప్రతి స్టెప్పూ జాగ్రత్తగా వేయాల్సిందే.

కానీ సోషల్ మీడియాలో మాత్రం పూజా హెగ్డే ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. తన అభిమానులను., ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్ చేస్తుంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే.