
ఈ మధ్య కాలంలో సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు సీనియర్ బ్యూటీ నయనతార.

రీసెంట్‌గా తన పర్సనల్ ప్రొఫెనల్ లైఫ్ నేపధ్యంలో ఓ డాక్యుమెంటరీ చేసిన నయన్, ఆ షోలో కెరీర్ ఎర్లీ డేస్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

లేటెస్ట్ షోలో తన కెరీర్ ఎర్లీ డేస్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు నయనతార. గజిని సినిమాలో తన లుక్స్ విషయంలో అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేసుకున్నారు.

డైరెక్టర్ ఎలాంటి డ్రెస్ వేసుకోమంటే నేను అదే వేసుకున్నా.. కానీ ఆ సినిమాలో నేను లావుగా ఉన్నానంటూ చాలా మంది కామెంట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

బిల్లా సినిమా టైమ్‌లోనూ అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నా అన్నారు నయన్. ఆ సినిమాలో బికినీలో కనిపించటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో డిస్కషన్ మొదలైందన్నారు.

తాను బికినీ వేసుకోవటం అందరికీ సమస్యలా మారిందన్నారు. కానీ తాను ఏదో ప్రూవ్ చేయాలని అలా చేయలేదని, కేవలం కథ డిమాండ్ మేరకే బికినీ వేసుకున్నా అన్నారు నయన్.

డిజిటల్ షో విషయంలోనూ వివాదాలను ఫేస్ చేశారు నయన్. ఆ షోలో నానూమ్ రౌడీదాన్ సినిమా కంటెంట్ వాడటంపై ధనుష్ అభ్యంతరం చెప్పటంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు నయనతార. దీంతో ఈ ఇద్దరి వివాదం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.