
నయనతార.. దాదాపు 20 ఏళ్లుగా సౌత్ సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేస్తున్న పేరు. హీరోయిన్‌గా పరిచయం అయిన దగ్గర నుంచి టాప్ స్టార్స్‌తో జోడి కడుతున్న ఈ బ్యూటీ, ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఎనౌన్స్ చేసిన మేకర్స్. కాస్ట్ అండ్ క్రూ విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నయనతార లీడ్ రోల్‌లో తెరకెక్కిన డివోషనల్ ఫాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్.

తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అందుకే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్.

సీక్వెల్‌లో అమ్మవారి పాత్రలో త్రిష నటిస్తున్న ప్రచారం జరిగినా... ఫైనల్‌గా మరోసారి నయనతారనే సెలెక్ట్ చేశారు మేకర్స్. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చినా...

దర్శకుడెవరన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తొలి భాగానికి నటుడు ఆర్జే బాలాజీ, ఎస్ జే శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీంతో సీక్వెల్‌కు కూడా వీళ్లే దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపించింది.

కానీ తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. హారర్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సుందర్ సి సీక్వెల్‌కు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

గ్రాఫిక్స్ విషయంలో సుందర్ సీకి మంచి అనుభవం ఉండటంతో ముకుత్తి అమ్మన్ 2కు ఆయన దర్శకత్వం వహిస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్. హారర్ సినిమాలతో సక్సెస్ కొట్టిన సుందర్ సీ, డివోషనల్ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాలి.