
నయనతార ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉన్నారు. మొన్న మొన్నటిదాకా సోషల్ మీడియాలో లేకుండా, ప్రెస్‌మీట్లకు, ఈవెంట్లకు రాకుండా ఉరించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుపెట్టాక, సస్పెన్సులతో ఎంగేజ్ చేస్తున్నారు.

క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నయనతార న్యూ బిగినింగ్స్... అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అందరికీ ఉన్నట్టు మీక్కూడా 24 గంటలే ఉన్నాయా మేడమ్ అని నయనతారని కాస్త సరదాగా, మరికాస్త క్యూరియస్‌గా అడుగుతున్నారు జనాలు.

ఒక్క వ్యక్తి ఎన్ని పనులు చేస్తారు? అంటూ ఆరా తీస్తున్నారు. ఓ వైపు కమర్షియల్ హీరోయిన్‌గా, ఇంకోవైపు విమెన్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మెప్పిస్తున్నారు నయన్.

రీసెంట్‌గా జవాన్‌తో ఈ అమ్మడి ప్యాన్ ఇండియా ఎంట్రీ అద్దిరిపోయింది. నటన మాత్రమే కాదు, ప్రొడ్యూసర్‌గానూ బిజీగానే ఉన్నారు నయనతార. మరోవైపు భర్త విఘ్నేష్ శివన్‌తోనూ, పిల్లలతోనూ ఏ అకేషన్‌నీ మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

రీసెంట్‌గా ఓన్ బ్రాండ్ నయన్ స్కిన్ కేర్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ని పనులతో బిజీగా ఉంటూనే ఆమె డైరక్షన్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కెమెరా వెనుక నిలుచుని, న్యూ బిగినింగ్స్ అని ఆమె పెట్టిన క్యాప్షన్‌తో అందరూ నయన్ కెప్టెన్ కుర్చీలో కూర్చుంటారని ఫిక్సయ్యారు.

ఆమె నిజంగానే డైరక్ట్ చేస్తారా? లేకుంటే కొత్త సినిమాలో డైరక్టర్ తరహా పాత్ర చేస్తున్నారా? అన్నది మరికొంతమంది డౌట్. విషయం ఏదైనా, అటెన్షన్ మాత్రం బాగానే గ్రాబ్ చేస్తున్నారు గార్జియస్ లేడీ.