సౌత్‌లో సూపర్ హిట్ అయిన బ్యూటీస్ నార్త్ వైపు చూడటం.. నార్త్‌లో సక్సెస్ అయిన భామలు హాలీవుడ్ బాట పట్టడం కామన్.. ఇప్పుడు దీపిక కూడా అదే ప్లానింగ్‌లో ఉన్నారు.
ఆల్రెడీ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇండియన్ సినిమాల్లోనూ అదే ప్లేవర్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న బ్యూటీ దీపికా పదుకోనే.
కమర్షియల్ సక్సెస్‌ల విషయంలోనే కాదు, నటిగానూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు దీప్స్. అయితే ఈ కష్టమంతా హాలీవుడ్ కెరీర్ కోసమే అన్న టాక్ వినిపిస్తోంది.
అందుకే నటిగా ప్రూవ్ చేసుకోవటంతో పాటు గ్లామర్ షో విషయంలోనూ ఎలాంటి లిమిట్స్ లేవంటున్నారు ఈ బ్యూటీ. వెబ్ మూవీగా రిలీజ్ అయిన గెహరియాన్‌లో హలీవుడ్ రేంజ్ రొమాంటిక్ సీన్స్‌లో నటించారు దీపిక.
పెళ్లి తరువాత ఆ రేంజ్ సీన్స్ చేయటం అప్పట్లో పెద్ద రచ్చే అయ్యింది. అయినా కామెంట్స్‌ను లైట్ అంటూ తన పని తాను చేసుకుపోతున్నారు ఈ క్రేజీ బ్యూటీ. పఠాన్ సినిమాలో యాక్షన్ రోల్‌లో నటించిన దీపిక, సాంగ్స్‌లో గ్లామర్ షోతో రచ్చ చేశారు.
కాంట్రవర్షియల్‌గా మారిన బీచ్ సాంగ్ పఠాన్ సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. అందుకే ఇప్పుడు అప్‌కమింగ్ మూవీ ఫైటర్‌లోనూ అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు దీప్స్.
ఫైటర్ సెకండ్ సింగిల్‌లో హృతిక్, దీపిక మధ్య కెమిస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ బిగ్ మూవీస్‌లో హీరో ఎవరైనా.. దీపిక గ్లామర్ యాంగిలే హైలెట్ అవుతుండటం కూడా ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది.