Avika Gor: ట్రెండీ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఫొటోస్ వైరల్.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది అవికా గోర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, పాప్ కార్న్ చిత్రాలతో ఆడియెన్స్ ను మెప్పించిందీ అందాల తార.