
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల అనన్య నాగళ్ల ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడిప్పుడే వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తుంది.

బేబీ సినిమాతో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

మల్లేశం సినిమాతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రశంసలు అందుకుంది.

కానీ హీరోయిన్ ఆఫర్స్ కోసమే వెయిట్ చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనన్య. ఇటీవలే తంత్ర మూవీతో మరో విజయాన్ని అందుకుంది.

హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అనన్య నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనన్య.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఏదోక ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల కొన్నాళ్లుగా గ్లామర్ ఫిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. తాజాగా నెట్టింట అనన్య షేర్ చేసిన ఫొటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి.