
ఓ రకంగా విజయ్, అజిత్‌లాంటివారు అదర్ మార్కెట్స్ మీద దృష్టి పెట్టకముందు నుంచే సూర్య అండ్ విక్రమ్ ఆ పని మీదే ఉండేవారు. కెరీర్ ప్రారంభంలో సూర్య అండ్ విక్రమ్ కలిసి సినిమాలు చేసి మెప్పించారు.

అదే జరిగితే విజయ్ అండ్ అజిత్ ప్లేస్‌లను రీప్లేస్ చేసేది ఎవరంటే సూర్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల కోసం విపరీతంగా కష్టపడతారనే పేరుంది సూర్యకి. ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇంకా అందుకోలేదనే టాక్ కూడా ఉంది.

విక్రమ్ 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ సినిమాలో మూగ అబ్బాయి పాత్ర ఆఫర్ వచ్చింది. ఆ పాత్ర కోసం అతడికి ఐఐటీ మద్రాసులో ఉత్తమ నటుడిగా అవార్డ్ రావడంతో ఆ అవార్డు ప్రధానోత్సవం తర్వాత స్నేహితుడితో కలిసి వస్తున్నప్పుడు ఘోరమైన బైక్ ప్రమాదానికి గురయ్యాడు.

దీంతో ఆ ఘటనలో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కుడి కాలును తీసేయ్యాలని సూచించారు వైద్యులు. కానీ అందుకు అతడి తల్లి ఒప్పుకోలేదు.

ప్రమాదం తర్వాత 4 సంవత్సరాలు వీల్ చైర్ కు పరిమితమయ్యాడు. కుడికాలు పూర్తిగా గాయపడిందని.. చీలమండ నుంచి మోకాలి వరకు ఎముకలు విరిగి చర్మం కందిపోయిందని.. తన కాలు తీసేయ్యకుండా కాపాడేందుకు దాదాపు 23 సర్జరీలు చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విక్రమ్.

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విక్రమ్.