- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay Thalapathy use Movie Publicity for His Political Journey Telugu Heroes Photos
Vijay Thalapathy: సినిమాలను రాజకీయానికి వాడేస్తున్న స్టార్ హీరో.! వర్క్అవుట్ అవుతుందా.?
రాజకీయం చేయాలని ఫిక్సైన తర్వాతే తమిళ హీరో విజయ్‌లో మార్పులు మొదలయ్యాయా..? అంతకుముందు ఏడాదికి ఒక సినిమా చేద్దాంలే అనుకున్న దళపతి.. ఇప్పుడెందుకు ఇంత వేగంగా పని చేస్తున్నారు..? పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే వరస సినిమాలు చేస్తున్నారా..? ఆయన రాజకీయాలకు పర్సనల్ క్రేజ్ ఎంతవరకు యూజ్ కానుంది..? ట్విట్టర్‌లో విజయ్ దూకుడు దేనికి సంకేతం..? తమిళ హీరో విజయ్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పడానికేం ఉంది..?
Updated on: Mar 16, 2024 | 9:09 PM

రాజకీయం చేయాలని ఫిక్సైన తర్వాతే తమిళ హీరో విజయ్‌లో మార్పులు మొదలయ్యాయా..? అంతకుముందు ఏడాదికి ఒక సినిమా చేద్దాంలే అనుకున్న దళపతి.. ఇప్పుడెందుకు ఇంత వేగంగా పని చేస్తున్నారు..? పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే వరస సినిమాలు చేస్తున్నారా..?

ఆయన రాజకీయాలకు పర్సనల్ క్రేజ్ ఎంతవరకు యూజ్ కానుంది..? ట్విట్టర్‌లో విజయ్ దూకుడు దేనికి సంకేతం..? తమిళ హీరో విజయ్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పడానికేం ఉంది..? ఆయన కనిపిస్తే అభిమానుల్లో కరెంట్ పాస్ అవుతుందిప్పుడు.

ఇక నిప్పుకు గాలి తోడైనట్లు.. ఇన్నాళ్లూ సినిమాల్లోనే ఉన్న విజయ్.. ఈ మద్యే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో విజయ్ ఇమేజ్ మరింత పెరిగింది.

తాజాగా 2023 ట్విట్టర్ మోస్ట్ టాక్డ్ మూవీస్‌లో విజయ్ లియో నెంబర్ వన్‌లో నిలవడమే ఈయన క్రేజ్‌కు నిదర్శనం. ట్విట్టర్‌లో దేశంలోనే లియో ఫస్ట్ ప్లేస్ అందుకోవడం.. టాప్ 3లో వారిసు నిలవడం విజయ్ క్రేజ్‌ను చూపిస్తుంది.

దీన్నే తన పొలిటికల్ ఇమేజ్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు దళపతి. అందుకే వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లుంది కాబట్టి.. ఆ లోపే కనీసం మూడు సినిమాలు చేయాలనుకుంటున్నారు విజయ్. కొన్నేళ్లుగా విజయ్ ఎంచుకుంటున్న కథల్లోనే రాజకీయాలున్నాయి.

ఇవన్నీ తన పొలిటికల్ కెరీర్ బిల్డ్ చేసుకోవడం కోసమే అనేవాళ్లు లేకపోలేదు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తున్న విజయ్.. తర్వాత డివివి దానయ్య నిర్మాణంలో నటించబోతున్నారు.

దీని తర్వాత లియో 2 ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి మరి చూడాలిక.. ఈ సినిమాలతో 2026 ఎన్నికల నాటికి విజయ్ బలమైన శక్తిగా ఎదుగుతారా లేదా అనేది..?




