
మనసారా అనుకున్న పని పూర్తయినప్పుడు వచ్చే శాటిస్‌ఫేక్షన్ చాలా బావుంటుంది. అందులోనూ పది మెట్లు ఎక్కుతామని అనుకున్న చోట, వెయ్యి మెట్లు ఎక్కేసి, స్టిల్ కౌంటింగ్ అని అంటున్నప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇప్పుడు అలాంటి సిట్చువేషన్‌లోనే నేనున్నా అని అంటున్నారు విజయ్ సేతుపతి.

ముంబైకార్, గాంధీ టాక్స్ సినిమాల ఆఫర్లు వచ్చినప్పుడు, ఇక మన దగ్గరికి ఎవరూ రారు. ఇవే ఆఖరు... అని అనుకున్నారట విజయ్ సేతుపతి. తనకు హిందీ సరిగా రాకపోవడంతో, అంతకు మించి అవకాశాలు తలుపు తట్టవని ఫిక్సయిపోయారట.

కానీ జవాన్ అవకాశం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయానని అంటున్నారు మిస్టర్ సేతుపతి. జవాన్ సినిమాలో షారుఖ్‌కి విలన్‌గా నటించమని అడిగినప్పుడు, ఏంటి నన్నే అడుగుతున్నారా? అని రీచెక్ చేసుకున్నారు.

అలాగే ఫర్జి ఆఫర్ వచ్చినప్పుడు కూడా నమ్మలేకపోయా. ఎందుకంటే, నా హిందీ స్కిల్స్ ఏంటో నాకు తెలుసు. అయినా ప్రేక్షకులు, ఫిల్మ్ మేకర్స్ నా మీద చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయా.

ఏ ప్రాజెక్ట్ చేసినా నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్స్ట్ పెట్టి మెప్పించాలని ఫిక్స్ అయిపోయా. ఈ సంక్రాంతికి విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్‌మస్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.

కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సేతుపతి.

మేకర్స్ తన చుట్టూ ఓ మాస్ ఎనర్జీని క్రియేట్ చేశారని, దాన్ని పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటాననీ అంటున్నారు విజయ్ సేతుపతి.