
లేకుంటే మొత్తం షూటింగ్ మధ్యలో ఆపి వచ్చేస్తారా? కోలీవుడ్‌లో ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ. దాదాపు నెల రోజులు షూటింగ్ ప్లాన్ చేశారు అజర్‌బైజాన్‌లో.

అక్కడ కొన్ని పాటలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాలనుకున్నారు. అన్నీ పూర్తి చేసి వీలైనంత త్వరగా అజిత్‌ని ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.

అయితే ఇప్పుడు అజిత్ సొంత పని మీద ఇండియాకి రావాల్సి వస్తోందట. పని పూర్తయిన వెంటనే టీమ్‌తో జాయిన్ అవుతారట.

ఆ మధ్య అనారోగ్యానికి గురయ్యారు అజిత్. ఇప్పుడు ఆ చెకప్ కోసం వస్తున్నారన్న మాటలూ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల అజిత్‌కి సర్జరీ కావడంతో సినిమా షూటింగ్ కూడా లేటయింది. షెడ్యూల్స్ లో డిస్టర్బెన్స్ లేకుండా అనుకున్న ప్రకారమే ముందుకు సాగి ఉంటే, మే నెలఖరుకు పూర్తి కావాలి షూటింగ్.

విడాముయర్చి సినిమా షెడ్యూల్‌ని కాస్త వాయిదా వేయమన్నారట అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ షెడ్యూల్స్ ని అనుకున్నదానికన్నా ముందే స్టార్ట్ చేయమన్నారట.

దీన్ని బట్టి గుడ్ బ్యాడ్ అగ్లీ కి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయ్యాకే, విడాముయర్చి ఫైనల్ షూటింగ్ పూర్తి కానుంది. అది అయితేగానీ, అక్టోబర్ రిలీజ్ మీద క్లారిటీ రాదు.