Kalki 2898 AD: మార్కెట్ రావడం గొప్ప కాదు.. దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప.. ప్రభాస్ ప్లాన్ అదుర్స్.!
మార్కెట్ రావడం గొప్ప కాదు.. వచ్చిన మార్కెట్‌ను నిలబెట్టుకోవడమే గొప్ప. ఇప్పుడదే చేస్తున్నారు ప్రభాస్. అది ఇండియాలో అయినా.. ఓవర్సీస్‌లో అయినా.. ఒకసారి తనకొచ్చిన మార్కెట్‌ను వదిలే సమస్యే లేదంటున్నారు రెబల్ స్టార్. అందుకే కల్కి కోసం ఏకంగా ఖండాలు దాటేస్తున్నారు. దేశం కాని దేశానికి టీం అంతా కలిసి వెళ్తున్నారు. తెలుగు హీరోలు కేవలం టాలీవుడ్‌కు మాత్రమే సొంతం కాదు. సౌత్ టూ నార్త్ మనోళ్లదే హవా.