వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ నితిన్... అప్ కమింగ్ సినిమాల విషయంలో సేఫ్ గేమ్‌కు రెడీ అవుతున్నారు. ఇటీవల వరుస ప్రయోగాలతో ఇబ్బందుల్లో పడ్డ ఈ యంగ్ హీరో, నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో ప్లాన్ మార్చారు. మరి నయా ఫార్ములా నితిన్‌కు సక్సెస్ తెచ్చి పుడుతుందా.?
వరుసగా మాచర్ల నియోజికవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో నిరాశపరిచిన నితిన్, అప్ కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రయోగాల జోలికి వెల్లకుండా హిట్ ఫార్ములాను రిపీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రజెంట్ తమ్ముడు సినిమాలో నటిస్తున్నారు నితిన్. వకీల్ సాబ్ లాంటి బిగ్ హిట్ తరువాత వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికితోడు నితిన్‌కు బాగా కలిసొచ్చిన పవన్ కల్యాణ్ టైటిల్‌ను రిపీట్ చేస్తుండటం కూడా ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది.
రీసెంట్‌గా రాబిన్ హుడ్ సినిమాను ఎనౌన్స్ చేశారు. గతంలో తనకు భీష్మా లాంటి బిగ్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఈ సినిమా చేస్తున్నారు నితిన్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎనౌన్స్‌మెంట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మరో హిట్ డైరెక్టర్‌కు నితిన్ ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల డిజిటల్‌లో సూపర్ హిట్ అయిన '90స్ ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హసన్‌కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.