Nani: పాన్ ఇండియా కోసం నాని మాస్టర్ ప్లాన్..

Edited By: Phani CH

Updated on: Sep 10, 2025 | 6:55 PM

నిదానమే ప్రధానం.. దేనికైనా ఓపిక ఉండాలంటారు పెద్దోళ్లు. నానిని చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. పాన్ ఇండియా అంటూ హడావిడి అస్సలు పడట్లేదు.. అలాగని ప్రపంచం ఫాలో అవుతున్న పాన్ ఇండియన్ మార్కెట్ వద్దనడం లేదు. దానికోసం సపరేట్‌గా ఓ ప్లాన్ ఫాలో అవుతున్నారు. దాన్నే నెక్ట్స్ సినిమాలకు అప్లై చేస్తున్నారు. ఇంతకీ ఏంటది..?

1 / 5
కరోనాకు ముందు ప్యాన్ ఇండియన్ మార్కెట్ ఆప్షన్ మాత్రమే.. కానీ ఇప్పుడది అవసరం.. రేపటికి అత్యవసరంగా మారిపోతుందేమో..? అందుకే హీరోలంతా అటే పరుగులు తీస్తున్నారు. నాని కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

2 / 5
ఈయన కూడా ఆ మార్కెట్ దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు.. కాకపోతే దానికోసం ప్రత్యేకంగా ఒక రూట్ ఫాలో అవుతున్నారు న్యాచురల్ స్టార్.ప్రభాస్, యశ్, బన్నీ మాదిరి అందరూ రాత్రికి రాత్రే ప్యాన్ ఇండియన్ హీరోలైపోరు.

3 / 5
దానికి చాలా ఓపిక కావాలి.. నాని అదే చేస్తున్నారిప్పుడు.. నెమ్మదిగా ఒక్కో పావు కదుపుతున్నారు. శ్యామ్ సింగరాయ్‌తో తొలిసారి దానికోసం ట్రై చేసారు.. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంకు ఇదే ఫార్ములా అప్లై చేసారు.

4 / 5
మొన్న హిట్ 3 సైతం అన్నిచోట్లా విడుదలైంది. నానికి హిందీలో మార్కెట్ లేకపోవచ్చు గానీ గుర్తింపు ఉంది.. ప్యారడైజ్ సినిమాతో అది మార్కెట్‌గా మారుతుందని నమ్ముతున్నారు నాని.

5 / 5
నెక్ట్స్ సుజీత్ ఉన్నారు.. OG తర్వాత ఈయన చేయబోయే ప్రాజెక్ట్ కావడంతో నాని 32పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలా ప్యాన్ ఇండియా కోసం ఒక్కో ఇటుక పేరుస్తున్నారు న్యాచురల్ స్టార్.. ఏదో ఒకరోజు అదే ఇల్లు అవుతుందని నాని అంచనా.