- Telugu News Photo Gallery Cinema photos Hero Nagarjuna next movie is guest appearance in rajamouli movie details here Telugu Heroes Photos
Nagarjuna: గెస్ట్ రోల్స్ కు సైన్ చేస్తున్న కింగ్ నాగ్.! నెక్స్ట్ ఆ మూవీస్ లో నాగార్జున.
గుంటూరు కారంతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేష్ నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్న సూపర్ స్టార్ కోసం భారీ సెటప్ రెడీ చేస్తున్నారు రాజమౌళి, కథ నుంచి కాస్టింగ్ వరకు ప్రతీ విషయంలోనూ ఆ రేంజ్ ఉండేలా చూసుకుంటున్నారు. గుంటూరు కారం తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్ నెక్ట్స్ మూవీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాజామౌళి మూవీని త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Feb 05, 2024 | 9:09 PM

గుంటూరు కారంతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేష్ నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్న సూపర్ స్టార్ కోసం భారీ సెటప్ రెడీ చేస్తున్నారు రాజమౌళి, కథ నుంచి కాస్టింగ్ వరకు ప్రతీ విషయంలోనూ ఆ రేంజ్ ఉండేలా చూసుకుంటున్నారు.

గుంటూరు కారం తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్ నెక్ట్స్ మూవీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాజామౌళి మూవీని త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే కథ లాక్ చేసిన జక్కన్న కూడా త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ మేకోవర్ అయ్యే పనిలో ఉంటే, జక్కన్న కాస్టింగ్‌ను ఫైనల్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ టాలీవుడ్ హీరో కీలక పాత్రలో నటించబోతున్నారు. రీసెంట్‌గా నా సామిరంగ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున... మహేష్, రాజమౌళి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ఈ విషయంలో అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా... ప్రజెంట్ నాగ్ మూవీ సెలక్షన్ చూస్తుంటే గెస్ట్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.

ఆ మధ్య పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించారు కింగ్, ప్రజెంట్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అందుకే మహేష్ మూవీలో కూడా నాగ్ నటించటం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు నాగ్‌కు బాలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ మహేష్ మూవీకి కూడా హెల్ప్ అవుతుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























