
ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుందనే విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి..? షూటింగ్ పరిస్థితేంటి..? థగ్ లైఫ్ ఎప్పుడు విడుదల కానుంది..?

కానీ పార్ట్ 2 డిజాస్టర్ కావటంతో ఇప్పుడు త్రీక్వెల్ విషయంలో ఇంకా ఏదైనా రీ వర్క్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు మేకర్స్. భారతీయుడు 3 ఈ ఇయర్‌లోనే రిలీజ్ అయితే థగ్ లైఫ్‌ను నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్‌లోనే రిలీజ్ చేసేలా ముందు ప్లాన్ చేసుకున్నారు.

భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారీయన. మణిరత్నంతో కమిటైన థగ్ లైఫ్‌పై ఫోకస్ చేసారు లోకనాయకుడు.

కమల్ హాసన్, మణిరత్నం అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమా నాయకుడు. 1987లో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ ఆల్ టైమ్ టాప్ 100 మూవీస్‌లో చోటు దక్కించుకుంది. అలాంటి క్లాసిక్ కాంబో 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతుంది.

దీంతో ఏ సినిమాను ముందు రిలీజ్ చేయాలన్న విషయంలో డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 దారుణంగా ఫెయిలయ్యింది. దీంతో నెక్ట్స్ మూవీ విషయంలో ఆలోచనలో పడ్డారు కమల్.

భారతీయుడు 2 డిజాస్టర్ కావటంతో కమల్ సినిమాల లైనప్ విషయంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ప్రజెంట్ భారతీయుడు 3తో పాటు థగ్ లైఫ్ సినిమాలతో బిజీగా ఉన్నారు కమల్. ఈ రెండు సినిమాలు దాదాపు ఫైనల్ స్టేజ్‌లోనే ఉన్నాయి.