
సైంధవ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న విక్టరీ హీరో వెంకటేష్, నెక్ట్స్ మూవీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆల్రెడీ సూపర్ హిట్స్ ఇచ్చిన ఫార్ములానే మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ వెంకీ ప్లాన్ చేస్తున్న ఆ మూవీ ఏంటి..?

ప్రయోగాలకు ఎప్పుడు సిద్ధంగా ఉండే టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ స్టార్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ, యాక్షన్, థ్రిల్లర్ జానర్స్‌ను కూడా టచ్ చేస్తుంటారు వెంకీ. ముఖ్యంగా రీమేక్‌తో సక్సెస్‌లు సాధించటంలో వెంకీది స్పెషల్ రికార్డ్.

అందుకే మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారట విక్టరీ స్టార్. ప్రజెంట్ సైంధవ్ వర్క్‌లో బిజీగా ఉన్న వెంకీ, నెక్ట్స్ మూవీ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజాగా మలయాళంలో రిలీజ్ అయిన నెరు సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వెంకీ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

దృశ్యం, దృశ్యం 2 సినిమాలు రూపొందించిన మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కింది నెరు. దృశ్యం సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేసిన వెంకీ కూడా సూపర్ హిట్ అందుకున్నారు.

మరోసారి అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ నెరుతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.