
దానికి తగ్గట్టే ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు రష్మిక అండ్ బన్నీ. సిల్వర్ స్క్రీన్స్ మీద వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో చూడటానికి రెడీగా ఉండమని పిలుపునిచ్చేశారు ఐకాన్‌స్టార్.

అటు సుకుమార్ ప్రాడెక్ట్ క్వాలిటీ కోసం నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉన్నారు. ఇటు ఫ్యాన్స డిసెంబర్ 5 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

వెయ్యి కోట్ల మార్క్.. ఓవరాల్ కలెక్షన్లు చూశాక మాట్లాడుకునే టాపిక్ ఇది.. కానీ పుష్ప సీక్వెల్‌కి మాత్రం వెయ్యి కోట్ల టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ టైమ్‌లోనే ఊరిస్తోంది.

జస్ట్ ఊరించడం కాదు.. ఐకాన్ స్టార్ సినిమాకు పక్కా వెయ్యి కోట్ల బిజినెస్ రాసిపెట్టుకోండి అనే ధీమా కనిపిస్తోంది అల్లు అర్జున్ ఆర్మీలో.

పుష్ప3కి కావాల్సిన పర్ఫెక్ట్ హుక్‌ని పుష్ప సీక్వెల్ ఎండింగ్‌లో సుకుమార్ ప్లాన్ చేశారన్నది ఫిల్మ్ నగర్‌లో వైరల్ న్యూస్. ఈ ఏడాది వెయ్యి కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాగా ఆల్రెడీ పుష్ప సీక్వెల్ ప్రచారంలో ఉంది.

డిసెంబర్ 6న సిల్వర్ స్క్రీన్ మీద గంధపు చెక్కల ఘుమఘుమలను ఆస్వాదించడానికి మేం రెడీ అనే సిగ్నల్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప2 కోసం వెయిటింగ్ బాగానే కనిపిస్తోంది.

ఒకవేళ ఇప్పటిదాకా ఉన్నా లేకున్నా, మేం అంటూ దిగాక అన్నీ సాధ్యపడాల్సిందేనని ట్రెండ్ చేస్తోంది అల్లు ఆర్మీ. పుష్ప2 ఇప్పుడు నేషనల్ లెవల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్.