చిరు భోళా శంకర్ నుంచి.. అజిత్ మోసగాడు వరకు.. లేటెస్ట్ టాప్ 5 ఫిల్మ్ అప్ డేట్స్ మీకోసమే..

| Edited By: Phani CH

Jul 13, 2023 | 12:11 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ భోళా శంకర్‌. మెహర్‌ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. పార్టీ మూడ్‌లో సాగే ఈ పాటలో చిరు తమన్నాతో పాటు సుశాంత్, కీర్తి సురేష్ కూడా ఆడి పాడారు.

1 / 5
భోళా శంకర్ సెకండ్ సింగిల్‌: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ భోళా శంకర్‌. మెహర్‌ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. పార్టీ మూడ్‌లో సాగే ఈ పాటలో చిరు తమన్నాతో పాటు సుశాంత్, కీర్తి సురేష్ కూడా ఆడి పాడారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న భోళా శంకర్, ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 / 5
వినాయక చవితికి మార్క్‌ ఆంటోని: టైమ్ ట్రావెల్‌ నేపథ్యంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మార్క్ ఆంటోని. అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ ఎనౌన్స్‌ చేశారు మేకర్స్‌. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

3 / 5
అజిత్ మోసగాడు: కోలీవుడ్ స్టార్  హీరో అజిత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు నిర్మాత మాణికం నారాయణన్. అజిత్ బయటకు కనిపిస్తున్నంత మంచి వాడేం కాదని, అతను తన దగ్గర చాలా ఏళ్ల క్రితం డబ్బు తీసుకొని ఇంత వరకు తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. అజిత్‌తో సినిమాలు చేసి చాలా మంది నిర్మాతలు నష్టపోయారని కానీ వాళ్లకు అజిత్‌ ఎలాంటి సాయం చేయలేదని చెప్పారు.

4 / 5
మైథలాజికల్‌ రోల్‌లో సంజు: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ మరో ఇంట్రస్టింగ్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో పౌరాణిక పాత్రలో నటించబోతున్నారు సంజుబాబా. ఈ సినిమా 2024 ఫస్ట్ క్వార్టర్‌లో సెట్స్ మీదకు వెళుతుందని వెల్లడించారు మేకర్స్. ప్రస్తుతం ది గుడ్ మహారాజా, లియో, బాప్ సినిమాలతో బిజీగా ఉన్నారు సంజయ్ దత్‌.

5 / 5
OMG 2: యాక్షన్ ట్రెండ్‌లో ఉన్న కంగన కూడా త్వరలో మైథలాజికల్‌ మూవీకి రెడీ అవుతున్నారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథతో సీత ది ఇన్‌కార్నేషన్‌ అనే సినిమా  చేస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.