
బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉండేదో చెప్పక్కర్లేదు. సంవత్సరాలపాటు స్మాల్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్. ఇందులో జగతి మేడమ్ పాత్రకు ఫ్యామిలీ అడియన్స్ వీరాభిమానులు అన్న సంగతి తెలిసిందే.

జగతి మేడమ్.. తన స్టూడెంట్ భవిష్యత్తు కోసం పోరాటం చేసే లెక్చరర్ గా.. కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ పాత్రలు చీరకట్టులో ఎంతో హుందాతనంగా, పద్దతిగా కనిపించి జనాలకు దగ్గరైంది.

ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకున్న జ్యోతిరాయ్.. ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. చిన్న చిన్న దుస్తులు ధరించి గ్లామర్ ఫోటోషూట్ చేస్తుంది.

నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట అరాచకం సృష్టిస్తుంది. తాజాగా జ్యోతిరాయ్ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్ కంటే ముందు కన్యాదానం అనే సీరియల్ చేసింది. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు.

కన్నడలో 15కు పైగా సీరియల్స్ చేసింది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిల ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ.. యాక్షన్ రొమాంటిక్ డ్రామాలతో అడియన్స్ ముందుకు వస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం కిల్లర్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది.