
స్టార్ హీరోయిన్ హన్సిక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజిబిజీగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత వరుసగా విదేశీ టూర్లకు చెక్కేస్తోన్న ఈ అందాల తార తన వెకేషన్ ఫొటోలను తరచూ షేర్ చేస్తోంది.

హన్సిక మోత్వాని 2022లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె తన చిరకాల మిత్రుడు సోహైల్ కతురియాను వివాహం చేసుకుని సంతోషంగా ఉంది. అప్పటి నుంచి వెకేషన్‌లోనే ఎక్కువగా ఉంటోందీ అందాల తార.

తన భర్తతో ఎక్కువ సేపు గడిపేందుకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది హన్సిక. అందుకే పలు దేశాలు చుట్టేస్తూ హాలీడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్‌మీడియాలోనూ షేర్ చేసుకుంటోంది.

హన్సిక మోత్వాని ప్రస్తుతం టర్కీలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి అందమైన బీచులు, దర్శనీయ ప్రదేశాలను చుట్టేస్తోంది. అదే సమయంలో తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోస్, వీడియోలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

అలా టర్కీ టూర్‌కు సంబంధించి హన్సిక షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హన్షిక. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటిస్తోంది.