
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రుతి హాసన్ కు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో వైరలవుతుంది. అందులో ఆమె ఆత్మవిశ్వాసంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆవేశపూరితమైన ప్రసంగం చేస్తూ కనిపించింది.

గంభీరమైన గొంతు.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో స్పీచ్ అదరగొట్టింది. స్టార్ కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతి హాసన్. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతో ఇప్పుడు గాయనిగా మారింది. ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించింది.

అనగనగా ఓ ధీరుడు సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. కానీ ఆ తర్వాత శ్రుతి హాసన్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత గాయనిగానూ రాణించింది. 2023లో శ్రుతిహాసన్ నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన క్రేజీ ఫోటోస్ సైతం ఆకట్టుకుంటున్నాయి. శ్రుతిహాసన్ చివరగా సలార్ చిత్రంలో నటించింది.