
బాలనటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన శ్రీదివ్య.. ఇప్పుడు వెండితెరపై కథానాయికగా సత్తా చాటుతుంది. 3 ఏళ్ల వయసులోనే టెలివిజన్ పై సీరియల్స్ లో కనిపించింది. శ్రీదివ్య పక్కా హైదరాబాద్ అమ్మాయి.

2006లో భారతి అనే సినిమాకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2010లో మససారా సినిమాతో హీరోయిన్ గా తొలిసారిగా వెండితెరపై కనిపించింది.

డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాప్ అనే సినిమాతో చాలా పాపులర్ అయ్యింది. మొదట్లో తెలుగు చిత్రాలలో కథానాయికగా అలరించింది. తెలుగులో కేరింత, బస్ స్టాప్, మనసారా, మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు సినిమాల్లో నటించింది.

అయితే శ్రీదివ్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

2013 సంవత్సరంలో నటుడు శివకార్తికేయన్ పొన్ రామ్ దర్శకత్వం వహించిన వరుత్తపాత వాలిపర్ సంగం చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.