
హ హా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన జెనీలియా ఇప్పుడు నార్త్ లో నిర్మాతగా ఓ వెలుగు వెలగాలని ఫిక్సయిపోయారు. సౌత్ స్టార్ హీరోయిన్లు చేసే పనులన్నిటినీ, నార్త్ లో కూర్చుని చక్కబెట్టేస్తున్నారు. భార్యాభర్తలుగా విడిపోకముందు సమంత, నాగచైతన్య కలిసి నటించిన సినిమా మజిలి.ఈ సినిమాను ఉత్తరాదిన టేకప్ చేశారు జెనీలియా.

Genelia And Riteish

మయోసైటిస్ గురించి సామ్ చెబుతున్న విషయాలను చాలా మంది ఆసక్తిగా వింటున్నారు. ''మంచి ఆహారం తీసుకుంటున్నా. నిద్రలేచి వ్యాయామం చేస్తున్నా. హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నా... అనే భ్రమలో చాలా మంది ఉంటారు. నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని. కానీ అది చాలా తప్పు. అలా ఎందుకు ఆలోచించానా అని ఇప్పుడు బాధపడుతుంటాను'' అని చెబుతున్నారు సామ్.

చాలా సందర్భాల్లో ప్రశాంతమైన వాతావరణం చాలా ముఖ్యం. స్ట్రెస్ లేని లైఫ్‌ని లీడ్ చేసిన వారే గొప్పవాళ్లు అని అంటున్నారు ఈ బ్యూటీ. మనం ఒత్తిడికి గురవుతున్నప్పుడు, దాని వల్ల జరిగే డ్యామేజ్ స్పాట్‌లో తెలియదు అని, తర్వాతే దుష్ఫలితాలు అర్థమవుతాయని చెప్పారు సమంత.

తారక్, చెర్రీతో రాజమౌళి సినిమా చేసేటప్పుడు ఆర్ ఆర్ ఆర్ అనే పేరును ముందు జనాలు ఫిక్స్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఆ పేరు చాలా బాగా వైరల్ అయింది. అందుకే ఎండ్ ఆఫ్ ది డే సినిమాకు కూడా అదే పేరు పెట్టేశారు జక్కన్న. ఇప్పుడు ధనుష్ 50 విషయంలోనూ అదే జరిగింది. ధనుష్ 50కి రాయన్ అనే పేరును వైరల్ చేశారు ఫ్యాన్స్. జనాల్లోకి ఆల్రెడీ అంతగా చొచ్చుకుపోయిన పేరును ఎందుకు వదిలిపెట్టాలి? కొత్తదాని వెనుక ఎందుకు పరుగులు తీయాలి? అని అనుకున్నారేమో... రాయన్ పేరునే ఫిక్స్ చేసేశారు ధనుష్. ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే, రాయన్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు ధనుష్.