బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయింది జెనీలియా డిసౌజా. అందులో అల్లరిపిల్లగా ఆమె అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. బొమ్మరిల్లుతో పాటు సాంబ, సై, మిస్టర్ మేధావి, రెడీ, ఢీ, హ్యాపీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార.
తెలుగుతో పాటు కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది జెనీలియా. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైందామె.
జెనీలియా- రితేష్ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఇటీవలే మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇచ్చింది జెనీలియా. భర్తతో కలిసి మజిలీ హిందీ రీమేక్‌లో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
ఇదిలా ఉంటే జెనీలియా మరోసారి గర్భం ధరించిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఈ ఈవెంట్‌కు తన భర్త రితేష్‌తో కలిసి హాజరైందీ అందాల తార. అందులో జెనీలియాకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపించడంతో నెటిజన్లు మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
తన ప్రెగ్నెన్సీ వార్తలపై జెనీలియా ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే అక్షయ్ కుమార్‌తో కలిసి హౌస్‌ఫుల్ 5తో రితేష్ నటిస్తున్నాడు.