
ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతున్నారు. ఆయనతో పాటు కబీర్‌సింగ్ స్టార్ కూడా వైరల్ అవుతున్నారు. వీరిద్దరేనా? అంటే.. వీరితో పాటు ఇంకో ఇద్దరు సౌత్ కెప్టెన్ల పేర్లు కూడా వార్తల్లో వినిపిస్తున్నాయి. ఇవాళ కాకపోయినా, రేపటి రోజైనా వీళ్లు కలిసి సినిమాలు చేస్తే చూడాలని ఉందనే కొత్త ఆశలు కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ లో.

ఫ్యామిలీస్టార్ ఓటీటీ వార్తతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు. అంతకన్నా ముందు కూడా ప్రశాంత్ నీల్ పేరుతో కలిసి వైరల్ అయింది. సలార్2లో గెస్ట్ రోల్ ఉంటుందని, అందులో విజయ్ నటిస్తారని, అందుకే వీరిద్దరూ కలిశారనీ ఓ టాక్..

అచ్చంగా విజయ్‌తోనే ప్రశాంత్ నీల్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్నది రౌడీ ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్న మాట. ఏదేమైనా ప్రస్తుతం ఫ్యామిలీస్టార్ నెక్స్ట్ సినిమా పనులతో బిజీ బిజీగా ఉన్నారు.

అటు అర్జున్‌రెడ్డి నార్త్ వెర్షన్ కబీర్‌సింగ్ హీరో కూడా ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ఆయనతో సక్సెస్‌ఫుల్ సౌత్ కెప్టెన్ వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నారన్నది హాట్ న్యూస్. దక్షిణాది దర్శకుల పట్ల షాహిద్ ఎప్పుడూ పాజిటివ్ అప్రోచ్‌తోనే ఉంటారు. ఆల్రెడీ సందీప్‌తో కబీర్‌సింగ్ సక్సెస్ చూశారు షాహిద్.

మన హీరోలతోనే కాదు, పొరుగు హీరోలతో సినిమాలు చేసి మెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆల్రెడీ కోలీవుడ్ దళపతి విజయ్‌తో చేసిన వారసుడు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. సౌత్ డైరక్టర్లకు నార్త్ లో జబర్దస్త్ గా వెల్కమ్ అందుతున్న ఈ టైమ్‌లో వంశీ పర్ఫెక్ట్ స్టెప్పులు వేస్తున్నారని అంటున్నారు క్రిటిక్స్.