Ram Gopal Varma: పట్టువదలని విక్రమార్కుడిలా వర్మ.. వ్యూహంకి లైన్ క్లియర్..

| Edited By: Prudvi Battula

Feb 29, 2024 | 3:44 PM

పట్టువదలని విక్రమార్కుడి గురించి పుస్తకాల్లో చదివాం కదా.. ఇప్పుడు నేరుగా చూద్దామా..? ఎక్కడున్నాడు అతడు అనుకుంటున్నారు కదా.? చెట్టంత రామ్ గోపాల్ వర్మ కళ్ల ముందు కనిపిస్తున్నపుడు ఎక్కడో బుక్కుల్లో ఉన్న విక్రమార్కుడు మనకెందుకు..? ఎట్టకేలకు వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నారు వర్మ. మరి ఈయన రాజకీయ శపథం ఎలా ఉండబోతుంది..?

1 / 5
వర్మ ఆటిట్యూడ్‌కు సరిగ్గా సరిపోయే పాట ఇది. అంతా ఆయనకు నచ్చిందే చేస్తుంటారు తప్ప పక్కవాళ్లు చెప్పేది అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. ఈయన వ్యూహం సినిమాపై కొన్ని రోజులుగా రచ్చ నడుస్తూనే ఉంది. మూడు నెలల వాయిదాల తర్వాత.. సెన్సార్ పూర్తి చేసుకుంది వ్యూహం. ఎట్టకేలకు మార్చి 2న విడుదల కాబోతుంది.

2 / 5
2019 ఎన్నికలకు ముందు కూడా వర్మ వరస సినిమాలు చేసారు. అప్పట్లో ఆయన చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలు కూడా చాలా వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడింకోసారి ఇదే చేస్తున్నారు వర్మ.

3 / 5
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వ్యూహం, శపథం అంటూ పొలిటికల్ థ్రిల్లర్స్ తో వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ రెండు సినిమాల్లోనూ వైఎస్ జగన్‌ను సపోర్ట్ చేస్తూ.. చంద్రబాబు, పవన్‌ను కించపరిచారనేదే అసలు వివాదానికి కారణం.

4 / 5
ఎవరెన్ని చేసినా.. ఎంత చెప్తున్నా.. వర్మ మాత్రం తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. మార్చి 1న వ్యూహం సినిమా విడుదలవుతుంటే.. ఇది విడుదలైన ఒక్కవారం గ్యాప్‌లోనే మార్చి 8న సీక్వెల్‌ను కూడా దించేస్తున్నారు కెప్టెన్ ఆర్జివి.

5 / 5
శపథం మార్చ్ రెండో వారంలో విడుదల చేయనున్నారు. సెన్సార్ సర్టిఫికేట్ పట్టుకుని.. పట్టు వదలని విక్రమార్కుడిని అంటూ తనకు తానే బిరుదు ఇచ్చేసుకున్నారు వర్మ. మరి ఈయన శపథం ఎలా ఉండబోతుందో చూడాలి.