
లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో హీరో, హీరోయిన్ బాధ్యతలను నాయిక ఒక్కరే మోయాలి. రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడిని హాల్‌లో కూర్చోబెట్టాలంటే చక్కటి ప్రతిభ కావాలి. అలాంటి టాలెంటెడ్ గర్ల్స్ ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? industry లో ఇదో సరికొత్త చర్చ...

అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు స్క్రీన్ మీద సందడి చేశాయంటే, ఆ కథను మోయగల నాయిక దొరికిందని అర్థం. ఇప్పుడు ఆ రేంజ్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు కనిపించడం లేదంటే, కథను నడిపించే నాయికలు కరవయ్యారని అర్థం అని అంటున్నారు క్రిటిక్స్. ఉన్నవారిలో రష్మిక బెటర్ పెర్ఫార్మర్ అనే నిర్దారణకు వస్తున్నారు.

సామి సామి అంటూ పల్లెటూరి పిల్ల కేరక్టర్‌లో పుష్ప పక్కన పర్ఫెక్ట్ అనిపించుకున్నారు మేడమ్ రష్మిక. ఇప్పుడు ఈ లేడీ చేతిలో లేడీ ఓరియంటెడ్ సినిమాలున్నాయి. రష్మిక బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంటే, మేకర్స్ మాత్రం ఆమెను దృష్టిలో పెట్టుకుని ఫీమేల్ ఓరియంటెడ్ స్టఫ్‌ని సిద్ధం చేసుకుంటున్నారు.

అటు కీర్తీ సురేష్ కూడా మహిళా ప్రాధాన్యం ఉన్న కంటెంట్‌ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. మహానటి సినిమా తర్వాత కీర్తీసురేష్ ఏం చేసినా సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా దసరాలోనూ కిర్రాక్ అనిపించారు కీర్తీ.

ప్రస్తుతం కీర్తీ చేతిలో దండిగానే ప్రాజెక్టులున్నాయి. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సినిమా చేసినా, సౌత్‌లో సరైన స్క్రిప్ట్ దొరికితే వదులుకోవడం లేదు కీర్తీ సురేష్. రీసెంట్‌గా మామన్నన్‌లో కీర్తీ నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. రివాల్వర్ రీటా, రఘుతాతాతో పాటు పలు ప్రాజెక్టులు ఆమె యాక్టింగ్‌ని బేస్ చేసుకునే రెడీ అవుతున్నాయి.