
పెద్ద సినిమాలు మొదలు కాకముందు ఒక రకమైన బజ్ ఉంటే, సినిమాలు రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఇంకో రకమైన క్రేజ్ కనిపిస్తుంటుంది. ఇంతకు ముందు కథల మీద జోనర్ల మీద ఉన్న బజ్...ఈ మధ్య గెస్ట్ అప్పియరెన్స్ చేసే స్టార్ల మీద కనిపిస్తోంది. అలాంటిదేమీ లేదు మొర్రో అని మేకర్స్ చెబుతున్నా, పట్టించుకోవట్లేదు ఫ్యాన్స్. తీరా సినిమా విడుదలయ్యాక అది ఇంకో రకమైన డిస్కషన్‌కి లీడ్ చేస్తోంది. రీసెంట్ టైమ్స్ లో జనాల్లో నలుగుతున్న ఇలాంటి గెస్ట్ అప్పియరెన్సుల మీద ఫోకస్ చేద్దాం రండి...

లియో సినిమా సెట్స్ మీద ఉన్నన్నాళ్లూ జనాలకు విజయ్ బాలీవుడ్ ఎంట్రీ మీద కన్నుండేది. అట్లీ డైరక్ట్ చేస్తున్న జవాన్‌లో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ విపరీతంగా బజ్ క్రియేటైంది. అసలు అలాంటిదేమీ లేదు... ఉంటే నేనే చెప్తాను అని అట్లీ అదేపనిగా చెప్పినా వినిపించుకున్నవారు మాత్రం లేరు. ఫైనల్‌గా జవాన్‌లో విజయ్ చేయలేదన్నది తెలిసినప్పుడు ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం.

జవాన్ సినిమా విషయంలో అలా జరిగింది కానీ, లోకేష్ కనగరాజ్ సినిమాలో మాత్రం అలా ఉండదు అని అంటున్నారు నెటిజన్లు. విక్రమ్ సినిమాలో అంత మంది స్టార్లను ఆయన హ్యాండిల్ చేసిన విధానం ఫిదా చేసిందన్నది వారు చెబుతున్న మాట.

కమల్‌హాసన్ విక్రమ్‌లో ఫాహద్, విజయ్ సేతుపతి ఉన్నట్టే... నెక్స్ట్ లోకేష్ చేయబోయే రజనీకాంత్ సినిమాలో షారుఖ్ నటిస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. గతంలో షారుఖ్ కోసం రజనీ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు రుణం తీర్చుకునే చాన్స్ షారుఖ్కి వచ్చింది కచ్చితంగా చేస్తారనే టాక్ వినిపించింది. అంతలోనే తూచ్... షారుఖ్ చేయట్లేదట అనే వార్తలు కూడా మొదలయ్యాయి. నిజానిజాలు తెలియాలంటే లోకేష్ ఓపెన్ అవ్వాల్సిందే.
