
కశ్మీర్ అంటే చల్లటి మంచు ప్రదేశాలు.. చుట్టూ చెట్లు.. కొండలు ఇలాంటి సీనరీనే మన మైండ్‌లో తిరుగుతుంది. మన దర్శకులు ఎక్కువగా చూపించిందిదే. అప్పుడప్పుడూ మణిరత్నం లాంటి దర్శకులు రోజాలో కశ్మీర్‌లోని అల్లర్లను కూడా చూపించారు. కానీ ఎక్కువ శాతం మేకర్స్ కశ్మీర్‌లోని బ్యూటీని మాత్రమే పాటల్లో చూపించే ప్రయత్నం చేసారు.

80ల్లో నుంచి కూడా కాశ్మీర్ అందాలను చూపిస్తున్నారు దర్శకులు. కానీ ఇప్పుడిప్పుడే దర్శకుల ఆలోచన విధానం మారుతుంది. కశ్మీర్‌లో ఫోకస్ చేయాల్సింది బ్యూటీపై కాదు.. అక్కడి రాజకీయాలపై అనే విషయం వాళ్లకు బాగా అర్థమైంది.

అందుకే కొన్నేళ్లుగా కశ్మీర్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా విడుదలైన ఆర్టికల్ 370 కూడా నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అవుతుంది. గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో జరిగిన పరిణామాలు, అక్కడి రాజకీయాల నేపథ్యంలోనే ఆర్టికల్ 370 తెరకెక్కించారు ఆదిత్య సుహాస్ జంభలే.

యమీ గౌతమ్, ప్రియమణి నటించిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా రావడమే కాదు.. వివాదమూ అలాగే రేగుతుంది. ఇక రిలీజ్‌కు రెడీగా ఉన్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్‌లో కశ్మీర్‌లోని పుల్వామా అటాక్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా.

2019లో జరిగిన పుల్వామా అటాక్స్‌పైనే ఆపరేషన్ వాలంటైన్ వస్తుంది. ఇక శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న అమరన్ సైతం 2014లో జరిగిన కశ్మీర్ యుద్ధం నేపథ్యంలోనే వస్తుంది. రెండేళ్ల కింద వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సృష్టించిన సంచలనం ఎవరూ మర్చిపోలేదు. మొత్తానికి కాశ్మీర్ అంటే కేవలం అందాలే కాదు.. కావాల్సినన్ని రాజకీయాలుంటాయని చూపిస్తున్నారు మన దర్శకులు.