
అక్కినేని నాగచైతన్యకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే తండేల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చైతూ కెరీర్ లోనే హయ్యేస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా.

ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు చైతూ. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే.. చైతూ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ.. కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు.

ఆ తర్వాత ఇద్దరూ తమ కెరీర్ లో బిజీ అయ్యారు. సామ్ తో విడిపోయిన తర్వాత చైతన్య హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల క్రితమే ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం శోభిత, చైతూ ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. గతంలో రానాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తొలి ముద్దు అనుభవం గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు. తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి తొలి ముద్దు ఇచ్చానని.. ఆ ముద్దు జీవితమంతా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అలాగే మరో విషయాన్ని చెప్పారు.

గతంలో ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. అయితే చైతూ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చైతూ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.