
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పైన కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆమె అక్క ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు.

నిషా అగర్వాల్ ఈ అమ్మడు కాజల్ అగర్వాల్‌కు చెల్లెలు. నిషా తన సినీ ప్రస్థానాన్ని 2010లో తెలుగు చిత్రం ఏమండి ఈవేళతో ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత సోలో (2011, మలయాళం), ఇష్టం (2012, తమిళం) వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో సుకుమారుడు, డీకే బోస్, కపిన్ బాబు వంటి సినిమాలు కొన్ని ఆమె గుర్తింపు తెచ్చినవి.

ఆ తర్వాత కెరీర్ పీక్ లో ఉండగానే వివాహం చేసుకుంది. ఇక తల్లిగా బాధ్యతల తర్వాత ఆమె నటనకు దూరమైంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.