
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి..ఇప్పటికీ దూసుకుపోతుంది. ఈ క్రమంలో తండేల్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ వేడుకకు సినీతారలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరలవుతుంది. చైతన్యతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన ఓ అమ్మాయి ఇప్పుడు నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? సినిమాలో దెయ్యంగా భయపెట్టింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో కుర్రాళ్లకు వెర్రెక్కిస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తమ మసూద మూవీ బ్యూటీ బాంధవి శ్రీధర్.

మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి మెప్పించింది. 2019లో మిస్ ఇండియా రన్నరప్ ఈ అమ్మాయి. అంతేకాకుండా మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019. అలాగే మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచింది.

ఆ తర్వాత మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించింది. కానీ మసూద సినిమాతోనే ఈ అమ్మడు ఫేమస్ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.